శ్రీ రాముడి విగ్రహం ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 31 March 2023

శ్రీ రాముడి విగ్రహం ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే !


కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్ శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరాముడి రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు రాముడి విగ్రహంపైకి ఎక్కారు. విగ్రహంపై పెద్దగా ఉంటే పక్కన నిచ్చెనలాంటిది ఏర్పాటు చేసుకుని దండ వేయవచ్చు. కానీ ఎమ్మెల్యే శరణు మాత్రం విగ్రహంపైకి ఎక్కి దండ వేసి అక్కడే నిలబడి అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలోసి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఇదేనా బీజేపీకి రాముడిపై ఉండే గౌరవం అంటూ ప్రశ్నిస్తు,,బీజేపీ నాయకులు దేవుళ్లను అవమానిస్తున్నారు అంటూ విమర్శలు సంధిస్తున్నారు. కాగా త్వరలోనే కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో ఇటువంటి వివాదం బీజేపీకి తలనొప్పిగా తయారైంది.

No comments:

Post a Comment