జపాన్‌ ప్రధాని ఆకస్మిక కీవ్‌ పర్యటన

Telugu Lo Computer
0


జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద ఆకస్మికంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పర్యటించారు. ఈ సంఘటన పలు దేశాలను ముఖ్యంగా చైనాను ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ నెల 19నుంచి 21 వరకూ భారత్‌లో పర్యటించిన కిషిద మంగళవారం ఢిల్లీ  నుంచి సంప్రదాయ ప్రభుత్వ విమానంలో కాకుండా ఛార్టర్డ్‌ విమానంలో రహస్యంగా ప్రయాణించి పోలండ్‌ చేరుకున్నారు. ఆ విమానం ఆదివారం రాత్రి జపాన్‌ రాజధాని టోక్యోలోని హనెడా విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ మేరకు జపాన్‌ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది. భారత పర్యటనను పూర్తి చేసుకున్న కిషిద మంగళవారం తెల్లవారుజామున అప్పటికే సిద్ధంగా ఉన్న ఛార్టర్డ్‌ విమానం ఎక్కి రహస్యంగా ప్రయాణించారు. పోలండ్‌ చేరుకున్న ఆయన అక్కడ నుంచి కీవ్‌కు చేరారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. తమ దేశం తరఫున సంఘీభావం తెలిపి, తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)