ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ

Telugu Lo Computer
0


ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి), భారత ప్రధాన న్యామూర్తి (సిజెఐ)లతో కూడిన కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో చట్టం చేసేవరకు ఈ కమిటీ అమలులో ఉండాలని జస్టిస్ కెంఎ జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పరిధిలోకి కాకుండా స్వతంత్రంగా ఉండాలని, స్వతంత్రంగా పనిచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ప్రజస్వామ్యంలో ప్రజలకే అధికారముంటుందని, ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తేనే సామాన్య ప్రజల చేతుల్లోనే ప్రజాస్వామ్య ప్రక్రియ శాంతియుతంగా మనగలుగుతుందని ధర్మాసనం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)