ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేటాయింపుపై వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనంటూ పాత పాటే పాడారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గతంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రాల ఆర్ధికలోటు భర్తీకి 14వ ఆర్ధిక సంఘం నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. దీంతో ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించిన అంశాన్ని నిత్యానందరాయ్ మరోసారి పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. ఈ ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా తెలిపారు. మరోవైపు తాజాగా ప్రధాని మోడీని కలిసిన సీఎం జగన్ .. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ఆయన దృష్టికి తెచ్చారు. కానీ జగన్ కు ఎప్పుడు ప్రధాని మోడీ మాత్రం ఇది ముగిసిన అధ్యాయంగా చెప్పడం లేదు. దీంతో వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)