మహాత్మా గాంధీ మనవరాలు కన్నుమూత

Telugu Lo Computer
0


మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకని మంగళవారం ముంబైలో కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న గోకని గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, రెండేళ్లుగా నిలబడలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్‌గాంకర్ తెలిపారు. గోకాని గాంధీ స్మారక్ నిధికి గతంలో ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. గాంధీజీ స్థాపించిన వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో ఆమె తన బాల్యాన్ని గడిపింది. ముంబైలోని గాంధీ స్మారక్ నిధి అనేది మహాత్మా గాంధీ తన జీవితకాలంలో అనుసరించిన అనేక రకాల నిర్మాణాత్మక కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది. 1955 అక్టోబర్ 2న మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించడంతో స్మారక్ నిధి లాంఛనంగా పని చేయడం ప్రారంభించింది. గాంధీ స్మారక్ నిధి ముంబై, మణి భవన్ గాంధీ సంగ్రహాలయ అనే రెండు సంస్థలు మణి భవన్‌లో ఉన్నాయి. మణి భవన్‌ భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)