ఆస్కార్‌కు నామినేట్‌ చేసే చిత్రాలపై ఏ.ఆర్‌.రెహమాన్‌ అసంతృప్తి !

Telugu Lo Computer
0


ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దిగ్గజం ఎల్‌.సుబ్రహ్మణ్యంతో తన యూ ట్యూబ్‌లో ఛానల్‌లో మాటామంతీ నిర్వహించారు ఏ.ఆర్‌.రెహమాన్‌. ఈ కార్యక్రమంలో తన సంగీత ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారాయన. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపిక చేసే సినిమాల విషయంలో భారత్‌ అనుసరిస్తున్న విధానంపై రెహమాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ చేసే సినిమాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్హత లేని చిత్రాల్ని ఆస్కార్‌కు పంపించడం వల్ల మంచి చిత్రాలు అవార్డులకు నోచుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు.  'భారత్‌ నుంచి చాలా చిత్రాలు ఆస్కార్‌ బరిలో నిలిచి వెనక్కి వస్తున్నాయి. అర్హత లేని చిత్రాల్ని ఎంపిక చేస్తున్నందు వల్లే అలా జరుగుతున్నది. ఈ విషయంలో మనం చూస్త్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం' అని అన్నారు. ఇటీవల ప్రకటించిన ఆస్కార్‌ పురస్కారాల్లో 'నాటు నాటు' పాటతో పాటు 'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ చిత్రం భారత్‌ నుంచి ఆస్కార్‌ పురస్కారాల్ని గెలుచుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌’కు మద్దతుగా, ఆ చిత్రాన్ని అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ చేస్తే బాగుండేదనే కోణంలో రెహమాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 2009లో 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికిగాను ఏ.ఆర్‌.రెహమాన్‌ రెండు ఆస్కార్‌ పురస్కారాల్ని గెలుచుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)