బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 March 2023

బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు


రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని జైస్వాల్ వ్యాఖ్యానించారు. రెండు వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలనే తాను ఈ రోజు గుర్తు చేశానని సమర్థించుకున్నారు. విదేశాల్లో ఇండియాను రాహుల్ గాంధీ అవమానించారని, మన ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పు అని అన్నారంటే.. రాహుల్ భారతదేశాన్ని విశ్వసించరని స్పష్టమవుతోందని విమర్శించారు. తనను తాను యువరాజుగా భావించిన రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వల్ల ఆందోళనకు గురయ్యాడని జైశ్వాల్ అన్నారు. రాహుల్ ఓబీసీ వర్గాన్ని కించపరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ అణగారిన వర్గాల పట్ల అవమానంకరంగా ప్రసంగం చేశారని ఆరోపించారు. అతను ఎక్కడికెళ్లినా ఓబీసీ ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


No comments:

Post a Comment