హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికారులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టుకు వెళ్లే మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో మంగళవారం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్డీఏ కమిషనర్‌ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏడీసీఎల్‌ అధికారులు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రూ.2.89 కోట్లతో విద్యుదీకరణ పనులను బుధవారం ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం వేరుగా టెండర్లు పిలిచారు. దీపాలు లేకపోవడం వల్ల న్యాయస్థాన ఉద్యోగులు, అక్కడికి వచ్చిపోయే రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు పిటిషన్‌ దాఖలు చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో పనులు దక్కించుకున్న ఎన్‌సీసీ సంస్థ ఈ పనులు చేయాలి. ప్రభుత్వం మారడం, పనులు నిలిచిపోవడం, బిల్లులూ మంజూరు చేయకపోవడంతో అంచనా వ్యయం పెరిగిందని సదరు సంస్థ పనులను తిరస్కరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)