దగ్గు మందులు అతిగా వాడకండి !

Telugu Lo Computer
0


దగ్గు, జలుబు, వికారం వంటి లక్షణాలు కలిగిన వారు ఎవరిని సంప్రదించకుండా యాంటిబయాటిక్స్ వాడవద్దని వీటిలో చాలా కేసులు ఇన్‏ఫ్లుయెంజా ఏ సబ్‏టైప్ హెచ్3ఎన్ 2 వైరస్‏కు కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా వెల్లడించింది. గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా దగ్గుతో దీర్ఘకాలం బాధపడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ సమస్యతో హాస్పిటల్ లో చేరిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒకసారి మొదలైన దగ్గు దాదాపు 15 రోజులకు పైగానే వేధిస్తుండటంతో ప్రజలు ఆ బాధ నుంచి బయటపడేందుకు యాంటీబయాటిక్స్‏ను విపరీతంగా వాడుతున్నారు. అయితే ఈ నాన్ స్టాప్ దగ్గు హెచ్3ఎన్2 అనే వైరస్ కారణంగా వస్తోందని తాజాగా ఐసీఎంఆర్ వెల్లడించింది. అందుకే దగ్గును నివారించడానికి విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచించింది. వారం తరువాత ఇన్‏ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోతుందని తెలిపింది. విపరీతంగా మందుల వాడకం వల్ల దీర్ఘకాలంలో అవి పనిచేయకుండా ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)