ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ టు రూల్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగులు ఈరోజు నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ఉద్యోగులు ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా ఇవాళ్టి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5. 30 వరకూ మాత్రమే పనిచేయాలని కోరారు. ఈ మేరకు ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాలన్నింటికీ సమాచారం పంపారు. మరోవైపు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు సైతం ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ నెల 23న సీఎస్, ఆర్థిక కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ నెల 23న సీపీఎస్ ఉద్యోగులందరూ తమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతంలో 10శాతం మినహాయించిన జగన్ సర్కార్ ప్రభుత్వ వాటాతో కలిపి పెన్షన్ ఖాతాకు జమ చేయలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 90 శాతం జీతం ఇచ్చి.. ఐటీ మాత్రం మొత్తం జీతానికి ఎలా వసూలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)