ఉభయసభలు రేపటికి వాయిదా !

Telugu Lo Computer
0


విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదాపడింది. సాయంత్రం 4:00 గంటలకు సభ తిరిగిప్రారంభమైనా విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.రాజ్యసభ కార్యకలాపాలు కూడా రేపటికి వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైనా రాహుల్ గాంధీ అనర్హత వేటుపై విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో ఛైర్మన్ సభను మంగళవారం ఉదయం 11:00 గంటలకు వాయిదా వేశారు. అదానీ వ్యవహారంలో రాహుల్‌ గాంధీని మాట్లాడనివ్వకుండా చేసిన తీరుపై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. ఈ మేరకు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో ఇవాళ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగించనుంది. ఇవాళ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ సభ్యులు నిరసన చేపట్టనున్నారు. ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ ఎంపీలకు ఇప్పటికే ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా నల్ల దుస్తులతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)