పిల్లలకు పాఠాలు చెబుతూ కుప్పకూలిన టీచర్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారి పాలెం గ్రామంలో  పిల్లలకు పాఠాలు చెబుతూ క్లాసులోనే ఒక ఉపాధ్యాయుడు మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం శనివారం ఉదయం పి. వీరబాబు (45) అనే ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెబుతూ కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే విద్యార్థులు, ఇతర టీచర్లకు ఈ విషయాన్ని తెలియచేయగా వారు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది టీచర్ నాడి పరీక్షించగా అప్పటికే ఆయన మరణించినట్లు తేలింది. ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ కళ్ల ఎదుటే మాస్టారు మరణించడాన్ని వారు జీర్ణించుకోలేక భోరున విలపించారు. వీరబాబు వేరే గ్రామం నుంచి ఇక్కడకు వచ్చేవారని స్థానికులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)