80 ఏళ్లు దాటిన వయోజనులకు ఓట్ ఫ్రం హోమ్

Telugu Lo Computer
0


దేశంలో మొట్టమొదటిసారి 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఇళ్ల నుంచే ఓటు వేసే కొత్త విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తీసుకురానున్నది. ఓట్ ఫ్రం హోమ్ (విఎఫ్‌హెచ్) పేరుతో ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. ఈ చర్య వల్ల దాదాపు 12.15 లక్షల మంది వృద్ధ ఓటర్లు, 5.55 లక్షల మంది దివ్యాంగులు ప్రయోజనం పొందనున్నారు. వివిధ కారణాల వల్ల పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ఓటర్ల ఇళ్లకు అధికారులు స్వయంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో వీరికి తోడ్పడతారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. 224 మంది సభ్యులతో కూడిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనున్నది. కర్నాటకలో మొత 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.62 మంది పురుష ఓటర్లు, 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)