స్నేహితులకు రాసిన లేఖల విలువ కోటి రూపాయలు !

Telugu Lo Computer
0

కింగ్ చార్లోస్ నుంచి విడాకుల సమయంలో యువరాణి డయానా స్నేహితులుకు రాసిన వ్యక్తిగత లేఖలు కోటి రూపాయలకు అమ్ముడుపోయాయి.  మామూలు జనం నుంచి ప్రిన్సెస్ లాంటి వాళ్లు కూడా ఉత్తరాలు రాసి తమ ఒత్తిడిని తగ్గించుకున్నారంటే అతిశయోక్తి కాదేమో! దానికి నిదర్శనమే ప్రిన్స్ డయానా లేఖలు. యువరాణి డయానా తన వ్యక్తిగత విషయాలను తన స్నేహితులకు లేఖల ద్వారా తెలియచేసింది. మొత్తం 32 ఉత్తరాను 'డయానా, ది ప్రైవేట్ కరస్పాండెన్స్ ఆఫ్ ఎ ప్రిన్సెస్' పేరు పెట్టి అమ్మకాన్ని చేపట్టారు. ఈ లేఖలు 1,61,00 పౌండ్ల ధర పలికింది. అంటే మన కరెన్సీలో కోటి రూపాయాలన్నమాట. డిసెంబర్ 1996లో ప్యారిస్ లో కారు ప్రమాదంలో చనిపోవడానికి కేవలం ఎనిమిది నెలల ముందు డయానా రాసిన లేఖ ఎక్కువ ధర పలికింది. అందులో క్రిస్మస్ ను విదేశాల్లో తను గడుపాలనే ప్రణాళికను, 1997 నూతన సంవత్సరం తనకు కొత్తగా ఉండబోతుందనే విషయం అందులో రాసింది ప్రిన్సెస్. కెన్సింగ్టన్ ప్యాలెన్ హెడ్డ్ నోట్ పేపర్ లోని రెండు పేజీల ఈ లేఖ సుమారు 31 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఫిబ్రవరి 17, 1996 న ఒక లేఖలో.. ' ఈ విడాకుల ద్వారా నేను ఏం అనుబవిస్తానో ఒక సంవత్సరం ముందు తెలిస్తే నేను ఎప్పటికీ అంగీకరించకపోయేదాన్ని. ఇదెంతో అసహ్యంగా అనిపిస్తున్నది' రాసుకుంది. ఇంకా అందరూ తనని నిశితంగా గమనిస్తున్నారని, స్నేహితులను కలువడానికి ఈ ఉత్తరాలు రాయడమే ఏకైక మార్గం అని యువరాణి ఆలోచించింది. అంతేకాదు.. తన వ్యక్తిగత విషయాలను కూడా వివరంగా రాయలేకపోతున్నానని కూడా బాధపడుతున్నట్లు అందులో పేర్కొంది. ఈ లేఖ సుమారు 27 లక్షల రూపాయలు పలుకడం విశేషం. అన్నిట్లో తను విడాకుల తర్వాత రాసిన లేఖ 5వేల పౌండ్లు అంటే సుమారు 5లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇలా అమ్ముడు అయినా డబ్బును వారి వారసులకు ఇవ్వలేదు. మంచి పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేస్తామని ఆక్షన్ హౌస్ ఒక ప్రకటనలో చెప్పింది. కొన్ని లేఖల్లో డయానా ఎంత ఒత్తిడికి గురైందో తెలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)