రేపటి నుంచి యాక్సిస్ బ్యాంక్ కనిపించదు !

Telugu Lo Computer
1


యాక్సిస్ బ్యాంక్ ను సిటీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సిటీ బ్యాంక్ కన్సూమర్ బిజినెస్, ఎన్‌బీఎఫ్‌సీ బిజినెస్ అన్నింటినీ యాక్సిస్ బ్యాంక్ కొనేసింది. ఈ డీల్ 2023 మార్చి 1 కల్లా పూర్తి అవుతుందని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. అంటే రేపటి నుంచి సిటీ బ్యాంక్ ఉండదు. యాక్సిస్ బ్యాంక్‌గా మారిపోతుంది. అంటే సిటీ బ్యాంక్ బ్రాంచులు అన్నీ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచులుగా పని చేస్తాయి. గత ఏడాది మార్చి నెలలో యాక్సిస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సిటీ బ్యాంక్ కన్సూమర్ బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీని కోసం రూ. 12,325 కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. నగదు రూపంలోనే ఈ డీల్ జరిగింది. సిటీ బ్యాంక్ కన్సూమర్ బిజినెస్‌లో లోన్స్, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్‌మెంట్, రిటైల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వంటివి అన్నీ ఉన్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియో చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. పరిశ్రమ సగటు ఖర్చు కన్నా ఈ క్రెడిట్ కార్డు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాంక్ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని యాక్సిస్ బ్యాంక్ గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మార్చి 1 కల్లా ఈ కొనుగోలు పూర్తి అవుతుందని వెల్లడించింది. అంటే ఇక వచ్చే నెల నుంచి సిటీ బ్యాంక్ కస్టమర్లు అందరూ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లుగా మారిపోతారు. నిర్దేశించిన గడువులోగా బ్యాంక్ కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతోందని యాక్సిస్ బ్యాంక్ తాజాగా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఈ డీల్ వల్ల సీటీ బ్యాంక్‌కు చెందిన 25 లక్షల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, రూ. 50,200 కోట్ల డిపాజిట్లు యాక్సిస్ బ్యాంక్ సొంతం కానున్నాయి. అంతేకాకుండా సిటీ బ్యాంక్‌కు చెందిన 7 ఆఫీసులు, 21 బ్రాంచులు, 499 ఏటీఎంలపై కూడా సర్వ హక్కులు యాక్సిస్ బ్యాంక్ చేతికి వెళ్లనున్నాయి. దీని వల్ల యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ బ్యాలెన్స్ షీటు 57 శాతం మేర పెరగనుంది. దీంతో దేశంలో టాప్ 3 క్రెడిట్ కార్డు కంపెనీల జాబితాలోకి యాక్సిస్ బ్యాంక్ వచ్చి చేరనుంది.

Post a Comment

1Comments

  1. మీరు పెట్టిన హెడింగ్ మార్చాలి. // రేపటి నుంచి సిటి బ్యాంక్ కనుపించదు // అని ఉండాలి.

    ReplyDelete
Post a Comment