రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ కారు నుజ్జు నుజ్జు

Telugu Lo Computer
0


ఎన్టీఆర్‌ కుమారుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదం ఆయన కుటుంబ సభ్యులు వచ్చి కారుని తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)