మీ కృషి అభినందనీయం !

Telugu Lo Computer
0


టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించేందుకు ఆపరేషన్ దోస్త్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ నుంచి రెస్క్యూ, మెడికల్ బృందాలను పంపింది. ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో భూకంప బాధిత దేశం టర్కీ నుంచి తిరిగి వచ్చింది. ఫిబ్రవరి 6న రెండు దేశాల్లోని వివిధ ప్రాంతాలు భూకంపం బారినపడి 40 వేల మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో టర్కీతో పాటు సిరియాకు సహాయం అందించేందుకు భారత్ 'ఆపరేషన్ దోస్త్'ను ప్రారంభించిందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. భూకంపం సంభవించిన టర్కీయేలో మోహరించిన భారతీయ విపత్తు సహాయక బృందాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంభాషించారు. వారు పనిని సక్సెస్ చేయడంతో ప్రధాని వారిని ప్రశంసించారు. టర్కీ, సిరియాలో 'ఆపరేషన్ దోస్త్'లో పాల్గొన్న సిబ్బందితో తాను సంభాషించానని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. విపత్తు సహాయక చర్యలలో వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)