హరిత వాయువులు ప్రాణాంతకంగా మారుతున్నాయి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 February 2023

హరిత వాయువులు ప్రాణాంతకంగా మారుతున్నాయి !


కార్బన్ డైయాక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో కార్బన్లు, మిథేన్ తదితర వాయువులన్నిటినీ గ్రీన్‌హౌస్ గ్యాస్‌లు అంటారు. ఇవి భూమిని వేడెక్కించి అమిత తాపాన్ని కలిగిస్తుంటాయని 1827లో ఫ్రెంచి శాస్త్రవేత్త బ్యాప్టిస్టు ఫోరియర్ నిర్వచించారు. ఈ హరిత వాయువులే ప్రాణాంతకంగా మారుతున్నాయి. శీతోష్ణస్థితిలో అనేక మార్పులు వస్తున్నాయి. సమస్త జీవరాశులపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. 2100 సంవత్సరం నాటికి 1.4 నుంచి 5.8 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చని, ఫలితంగా మానవ జీవితం దుర్భరమౌతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1991- 2018 మధ్యకాలంలో సంభవించిన మరణాల్లో మూడో వంతు కన్నా ఎక్కువ శాతం మరణాలు అత్యధిక వేడి కారణం గానే సంభవించాయని, దీని వెనుక మానవ కల్పిత చర్యల్లో పెరిగిన భూతాపం ప్రభావం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. మొత్తం 43 దేశాల లోని 732 ప్రాంతాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. 2000 నుంచి 2019 మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మీద మరణాల రేటు, ఉష్ణోగ్రతల డేటాను పరిశీలించగా, దశాబ్దానికి 0.26 సెల్సియస్ డిగ్రీల వంతున పెరిగినట్టు గుర్తించారు. ప్రపంచం మొత్తం మీద అతి శీతల, అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతల ఫలితంగా ఏటా 9.43 శాతం మరణాలు పెరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రపంచం మొత్తం మీద సంభవిస్తున్న ఈ మరణాల్లో సగం కన్నా ఎక్కువ ఆసియా లోనే ముఖ్యంగా తూర్పు, దక్షిణాసియా లోనే కనిపిస్తున్నాయి. ఐరోపాలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రతి 1,00,000 మందికి అదనంగా మరణాల సంఖ్య పెరుగుతుండగా, సబ్ సహరాన్ ఆఫ్రికాలో ప్రతి లక్ష మందికి అత్యధిక శీతలం వల్ల అదనంగా మరణాలు సంభవిస్తున్నాయి. భారత దేశంలో అసాధారణ వాతావరణ మార్పుల వల్ల 2100 నాటికి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా . ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలుతోపాటు అతిశీతల వాతావరణం వల్ల భారత్‌లో ఏటా దాదాపు 7,40,000 మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.

No comments:

Post a Comment