బీహార్‌లో వింత సంఘటన !

Telugu Lo Computer
0


బీహార్‌లోని ఖగాఢియా జిల్లా ఛౌథామ్‌ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముఖేశ్‌, నీరజ్‌ అనే వ్యక్తి భార్యతో పరారయ్యాడు. దీంతో ముఖేశ్‌ భార్యను నీరజ్‌ వివాహం చేసుకున్నాడు. నీరజ్‌కు ఇప్పటికే నలుగురు పిల్లలున్నారు. మరోవైపు, ఈ ఘటనతో సంబంధమున్న ఇద్దరు మహిళల పేర్లూ రూబీయే కావడం గమనార్హం. ముఖేశ్‌తో వెళ్లిపోయిన రూబీకి వివాహానికి ముందు నుంచే అతనితో పరిచయం ఉంది. పెళ్లికి ముందు అతడిని ప్రేమించింది. పెళ్లి తర్వాత పరిచయాన్ని కొనసాగించింది. ముఖేశ్‌కూ గతంలో వివాహం అయింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో అతను ప్రియురాలు రూబీని ఇంటి నుంచి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం వారిద్దరూ.. తమ ముగ్గురు సంతానాన్ని తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు. ముఖేశ్‌తో తన భార్య వెళ్లిపోయిన సంగతి నీరజ్‌కు తెలియడంతో అతను పస్రాహా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టగా ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముఖేశ్‌ అంగీకరించలేదు. దీంతో ముఖేశ్‌పై పగ తీర్చుకునేందుకు నీరజ్‌ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ముఖేశ్‌ మొదటి భార్య రూబీతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఈ నెల 18న స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. నీరజ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, ముఖేశ్‌ రోజు కూలీగా పనిచేస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)