లాలూయాదవ్, రబ్రీదేవీలకు ఢిల్లీ కోర్టు సమన్లు !

Telugu Lo Computer
0


ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో నిందితులైన కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీదేవీలకు ఢిల్లీ హైకోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కాంలో నిందితులైన లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య, మాజీ సీఎం రబ్రీదేవి, కుమార్తె మీసాభారతి, మరో 11 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులు మార్చి 15వతేదీన ఢిల్లీ హైకోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. యూపీఏ -1 ప్రభుత్వ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రంలో అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములు తీసుకొని దానికి బదులుగా రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. రైల్వే ఉద్యోగాలకు భూమి ఇచ్చిన కుంభకోణంలో లాలూ సన్నిహితుడు భోలా యాదవ్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఉద్యోగం పొందిన హృదయానంద్ చౌదరిని సీబీఐ అరెస్టు చేసింది. సింగపూర్ దేశంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు అతనికి సమన్లు జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)