చాక్లెట్‌లతో పెళ్లి కూతురు అలంకరణ

Telugu Lo Computer
0


చిత్ర అనే ఓ మేకప్​ ఆర్టిస్ట్​ చాక్లెట్ జడతో ఉన్న పెళ్లి కూతురు ఫొటోలు, వీడియోలు షేర్​ చేసింది. ఈ వీడియోలో కిట్ క్యాట్, ఫైవ్ స్టార్, మిల్కీ బార్, ఫెర్రెరో రోచర్ లాంటి బ్రాండెడ్ చాక్లెట్లతో ఆమె జుట్టును అందంగా అలంకరించారు. కేవలం జడ మాత్రమే కాదు పాపిడి బిల్ల, నెక్లెస్ లను కూడా చాక్లెట్లతో తయారు చేసి డెకరేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో నెటిజన్లు కూడా కాస్త భిన్నంగానే కామెంట్లు పెడుతున్నారు. 'పెళ్లి కూతురు జడ బాగుంది కానీ.. పిల్లలు ఆ జడను చూస్తే వదిలిపెడతారా?' అంటూ రిప్లై ఇస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)