హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు పట్టించుకోని పందెం రాయుళ్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందర్భంగా  కోడి పందాల  జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామ శివారుల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట, లోన బయట, పెద్ద బజార్, చిన్న బజార్ లను కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైకోర్టు  ఆదేశాలు, పోలీసులు ఆంక్షలన్నింటినీ పట్టించుకోవడం లేదు. గతంతో పోల్చుకుంటే ఈ సారి మరింత జోరుగా పందాలు సాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో భారీగా కోడి పందాల సందడి కనిపించింది. ఏలూరు జిల్లాలో కోడి పందాలు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ లను తలపించాయి. కొన్ని పందెం బరుల దగ్గర అయితే గోవా కల్చర్ కనిపిస్తోంది.. చీకటి పడిన తరువాత కూడా కోడి పందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్లడ్ లైట్ల వెలుగులో పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలను చూసేందుకు సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కోడి పందాల్లో పాల్గొంటున్న వారు శిబిరాల వద్దే మద్యం తాగుతూ మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందెం స్థావరాల దగ్గర మద్యం అయితే ఏరులై పారుతోంది. పందాలను చూసేందుకు ఎల్ ఈడీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరించడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. విజయవాడలో క్యాసినో నిర్వహించడం మళ్లీ చర్చనీయాంశమైంది. అంబాపురంలో బయట కోడిపందాలు జరుగుతుండగా లోపల క్యాసినో జూదం కొనసాగింది. బరి మధ్యలో క్యాసినో డేరే ఏర్పాటు చేసి సెక్యూరిటీగా నిర్వహికులు బౌన్సర్లను పెట్టినట్టు సమాచారం. అయితే అక్కడికి కేవలం పాస్ ఉన్నవారిని పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కోనసీమ, నెల్లూరు , తిరుపతి జిల్లాల్లో కోది పందాలను రహస్య స్థావరాల్లో నిర్వహించారు. కోడిపందాల ముసుగులో జోరుగా గుండాట, పేకాట సాగాయి. కొవ్వూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు నిర్వహించారు. రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జల్లి కట్టు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)