టీమిండియా క్రికెటర్లతో జూనియర్ ఎన్టీఆర్

Telugu Lo Computer
0


జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్రికెటర్స్ కూడా ఈ సినిమాను చూసి చాలా పాజిటివ్ గా స్పందించారు. ప్రత్యేకంగా కొంతమంది టీమ్ ఇండియా క్రికెట్ ఆటగాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకొని ఫోటోలకు స్టిల్ ఇచ్చారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన టీమిండియా సభ్యులు యంగ్ టైగర్‌ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానం ఉన్న ఈ స్టార్స్ తారక్ ను కలుసుకోవడంతో ఎంతగానో హ్యాపీగా ఉందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీమిండియా క్రికెట్ సభ్యులందరికీ కూడా కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చారు అందులో సూర్యకుమార్ యాదవ్ యుజ్వేందర్ చాహల్ శుభమన్ గిల్ దీపక్ చాహార్ అలాగే మరి కొంతమంది క్రికెటర్స్ కూడా ఫోటోలో కనిపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)