మూత్రం వాసన చూసి చీమలు క్యాన్సర్ ని గుర్తించగలవా ?

Telugu Lo Computer
0


చీమలకు క్యాన్సర్ ను గుర్తించగలవని కొత్త అధ్యయనంలో తేలింది. చీమలు మూత్రం వాసన చూడటం ద్వారా క్యాన్సర్ ని గుర్తించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చీమలకు ముక్కులు లేకపోయిన వాటి ముందు భాగంలో ఉంటే యాంటేన్నా వంటి నిర్మాణాలపై గ్రాహాకాలు ఉంటాయి. ఇవి వాసనను గుర్తించగలవు. ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న కణితులు అస్థిరమైన కర్బన సమ్మేళనాలని పిలువబడే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇమ మన చమట, మూత్రంలో కనిపిస్తాయి. అయితే చీమలు మూత్రంలో ఉండే వీటిని గుర్తించగలవు. ప్రోసిడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీ: బయోలాజికల్ సైన్సెస్ అనే జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. రోగుల్లో క్యాన్సర్ ని గుర్తించేందుకు ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న నిర్థారణ ప్రక్రియగా అభివర్ణించారు. ఈ అధ్యయనం కోసం మానవ రొమ్ము క్యాన్సర్ ట్యూమర్ ముక్కలను ఎలుకల్లో ప్రవేశపెట్టారు. మరికొన్ని ఎలుకను సాధారణంగానే ఉంచారు. శాస్త్రవేత్తలు ఫార్మిక ఫుస్కా అనే జాతికి చెందిన 35 చీమలను క్యాన్సర్ కణితులు ఉన్న, లేకుండా ఉన్న ఎలుకల మూత్ర నమూనాలతో ప్రయోగం నిర్వహించారు. సాధారణ ఎలుకలతో పోలిస్తే.. క్యాన్సర్ బాధపడుతున్న ఎలుకల మూత్ర నమూనాల చుట్టే ఎక్కువ సమయం గడిపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవుడి మూత్రంలోని క్యాన్సర్ ని కూడా చీమలు ఇదే రకంగా పసిగట్టగలవా అని శాస్త్రవేత్తలు చూడాలని అనుకుంటున్నారు. కుక్కలు, ఇతర జంతువులకు కన్నా చీమలకు ఈ రకం శిక్షణ ఇవ్వడానికి తక్కువ సమయం పట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కుక్కలకు ఆరు నెలల శిక్షణ అవసరం అయితే చీమలు వాసన పసిగట్టడానికి కేవలం 10 నిమిషాల్లోనే మూడు రౌండ్ల శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని సోర్బోన్ ప్యారిస్ నోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత ప్రొఫెసర్ ప్యాట్రిజియా డి ఎట్టోర్ ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే క్యాన్సర్ ఉన్న వ్యక్తులను గుర్తించడానికి చీమలు బయో-డిటెక్టర్లగా ఉపయోగించవచ్చని, అవి సులభంగా శిక్షణ పొందుతాయి, వేగంగా నేర్చుకుంటాయని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)