ఇండొనేసియాలో భారీ భూకంపం

Telugu Lo Computer
0


ఇండొనేసియా తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.63గా నమోదైంది. భూకంపం వచ్చిన 3 గంటల తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. సముద్ర అలల్లో పెద్దగా కదలిక లేకపోవడంతో సునామీ హెచ్చరికను ఎత్తివేసింది. తూర్పున ఉన్న తనింబార్ దీవుల్లో మంగళవారం ఈ భూకంపం వచ్చింది. ఇది భారీ భూకంపం కావడం వల్ల భూకంపం తర్వాత 4 సార్లు భూమి చిన్నగా కంపించింది. ఈ ప్రకంపనల ప్రభావం ఉత్తర ఆస్ట్రేలియాలోనూ కనిపించింది. ఇండొనేసియా విపత్తుల సంస్థ ప్రకారం కొన్ని ఇళ్లు మాత్రమే దెబ్బతిన్నాయి. ఈ భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 130 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు తెలిసింది. రాత్రి 2.47కి ఈ భూకంపం వచ్చినట్లు తెలిసింది. ఉదయం 5.43కి సునామీ హెచ్చరికను తొలగించారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 దాటితే అలాంటి వాటిని భారీ భూకంపాలుగా చెబుతారు. ఎందుకంటే వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వుంటుంది. ఇండొనేసియా కింద భారీ అగ్నిపర్వతం ఉంది. దాని వల్ల తరచూ అక్కడ భూకంపాలు వస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)