హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఉప్పల్ మ్యాచ్ టికెట్లు

Telugu Lo Computer
0


హైదరాబాద్ ఉప్పల్ వేదికగా 18న జరగనున్న ఇండియా - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆన్‭లైన్‭లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి. ఈ మ్యాచ్ కోసం 14న 6 వేల టికెట్లు, 15న 7 వేల టికెట్లు ఆన్‭లైన్‭లో అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఆన్‭లైన్‭లో 20వేల టికెట్లను హెచ్‭ సీఏ అధికారులు విక్రయించారు. పేటీఎం ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. టికెట్స్ విక్రయాలు జరుగుతున్న సమయంలో సైట్ సరిగా పనిచేయడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరో 9417 టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. మరోవైపు హెచ్‭ సీఏ తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆన్‭లైన్‭లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఇవాళ్టి నుంచి ఫిజికల్ టికెట్స్ ఇవ్వనున్నారు. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్‭లైన్‭లో బుక్ చేసుకున్నట్టు మెసేజ్ చూపించిన వారినే స్టేడియంలోపలికి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 8 కౌంటర్లు, 75 మంది పోలీసులు, గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్లు, 80 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తే.. స్కాన్‌ చేసి పేటీఎం సిబ్బంది ఫిజికల్ టికెట్లను ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మరో 7 వేల టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)