కుటుంబ గొడవల్లోకి న్యాయవాదులను లాగొద్దు !

Telugu Lo Computer
0


లలిత్ మోదీకి సుప్రీంకోర్టు చురకలు అంటించింది. కుటుంబ తగాదాల్లోకి న్యాయవాదులను లాగొద్దని సూచించింది. సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీపై సోషల్ మీడియా వేదికగా లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ''మీ న్యాయ పోరాటం వేరు. ఇందులోకి న్యాయవాదుల్ని తీసుకురాకండి' అని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. లలిత్ మోదీకి ఆయన తల్లి బీనా మోదీ కి సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదా జరుగుతోంది. ఈ కేసులో బీనా మోదీ తరపున ముకుల్ రోహత్గీ న్యాయవాదిగా ఉన్నారు. దీంతో రోహత్గీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో లలిత్ మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని పోస్టులలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం మరో పోస్టులో క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణ విషయాన్ని ధర్మాసనం ముందు లలిత్ మోదీ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే ప్రస్తావించారు. అంతే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోస్టులను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)