నా కూతురు, మనవడు ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 11 January 2023

నా కూతురు, మనవడు ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా?


బెంగుళూరు మెట్రో నిర్మాణంలో ఉన్న ఒక పిల్లర్ పడిపోవడంతో ఒక మహిళ సహా ఆమె కూతరు మరణించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌) ప్రకటించింది. అయితే తమ నిర్లక్ష్యాన్ని డబ్బులతో చెరిపేసుకుంటారా అంటూ మృతురాలి తండ్రి మదన్‌ న్యాయం కావాలని అంటున్నారు. తన కూతురు మరణానికి కారణమైన వారిని శిక్షించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని బుధవారం కోరారు. మెట్రో బీఎంఆర్‌సీఎల్‌ ఆర్థిక సాయంపై ఆయన మండిపడ్డారు. తానే కోటి రూపాయలు ఇస్తానని, తన కూతుర్ని తెచ్చిస్తారా అంటూ ప్రశ్నించారు. మంగళవారం బెంగళూరు నగరంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మోటార్‌సైకిల్‌పై పడింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని, ఆమె కుమారుడు విహాన్ మరణించారు. భర్త లోహిత్ సోలాక్‌తో కలిసి ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కూతురు విస్మిత సోలాకే సహా కూతురు విస్మిత సురక్షితంగా బయటపడ్డారు. కాగా, మృతుల కుటుంబాలకు బీఎంఆర్‌సీఎల్‌ 20 లక్షల రూపాయలు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. మీడియాతో మదన్ మాట్లాడుతూ.. "నాకు వారి పరిహారం అవసరం లేదు. వారికి కోటి రూపాయలు నేనే చెల్లిస్తాను. నా కూతురు, మనవడి ప్రాణాలను ముఖ్యమంత్రి తిరిగి ఇవ్వగలరా? బిఎమ్‌ఆర్‌సిఎల్, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌సిసి)లో స్పష్టమైన లోపం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, ప్రాణాలను కాపాడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతోపాటు అధికారులను కూడా అరెస్టు చేయాలి. ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోకపోతే వందలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారు" అని అన్నారు. బీఎంఆర్‌సీఎల్‌, ఎన్‌సీసీ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఎన్‌సీసీ జూనియర్ ఇంజనీర్ ప్రభాకర్, డైరెక్టర్ చైతన్య, స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్ మథాయ్, ప్రాజెక్ట్ మేనేజర్ వికాస్ సింగ్, సూపర్‌వైజర్ లక్ష్మీపతు, బిఎమ్‌ఆర్‌సిఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్ బెండేకరి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వెంకటేష్ శెట్టిలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

No comments:

Post a Comment