అంగరంగ వైభవంగా శునకాల వివాహం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలో సుఖ్రవాలి గ్రామంలో మకర సంక్రాంతి రోజైన జనవరి 14న అంగరంగ వైభవంగా టామీ, జెల్లీ అనే శునకాల వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మేనల్లుడు ఆలోచనను కార్యరూపాన్ని దాల్చాడు అతడి మేనమామ దేవేష్ చౌదరి. తమ వద్ద ఓ మగ కుక్క పిల్ల ఉందని, ఆడ కుక్క పిల్ల అయిన జెల్లీ కోసం తన మామను సంప్రదించి, ఒప్పించామన్నారు. ఈ పెళ్లి తంతు కోసం సుఖ్రవాలి మాజీ గ్రామ పెద్ద, టామీ యజమాని దేవేష్ చౌదరి అన్ని ఏర్పాట్లు చేశారు. అతిధుల జాబితాను సిద్ధం చేసుకుని, పెళ్లి ముహుర్తం కోసం పంతులను సంప్రదించారట. పెళ్లి రోజు రాగానే.. టామీని అలకరించి, మంగళ వాద్యాలతో, అతిధుల నృత్యాలతో ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చామని దేవేష్ చౌదరి చెప్పారు. వేద మంత్రాలతో పండితుడు ఈ పెళ్లి తంతును ముగించగా, హోమ గుండం చుట్టూ ప్రదిక్షణలు చేయించారట. పెళ్లికి వచ్చిన అతిధుల కోసం దేశీయ నెయ్యితో చేసిన వంటలను వండించామని, ఈ కుక్కల పెళ్లికి మొత్తం లక్షరూపాయలు ఖర్చు అయిందని దేవేష్ చెప్పారు. అక్కడే ఉన్న వీధి కుక్కలకు కూడా ఆహారం అందించారట !. 

Post a Comment

0Comments

Post a Comment (0)