50 రోజుల క్రితం అదృశ్యమైనా ఇప్పటివరకు జాడ లేదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 19 January 2023

50 రోజుల క్రితం అదృశ్యమైనా ఇప్పటివరకు జాడ లేదు !


హైదరాబాద్‌లో లోకో పైలట్‌ వాసవ ప్రభ మిస్సింగ్‌ సంచలనంగా మారింది. 50 రోజుల క్రితం అదృశ్యమైనా ఇప్పటివరకు జాడ లేదు. ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు. వాసవికి, సాయి సంచిత్‌తో డిసెంబర్‌ 11న పెళ్లి చేయాలని పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. హ్యాపీగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. కాబోయే భర్తతో కలిసి షాపింగ్‌ కూడా చేసింది. కానీ ఆ తర్వాత అతను పెట్టే రూల్స్‌కు భయపడిపోయింది వాసవి. ఆ విషయం అటు తల్లిదండ్రులకు చెప్పలేక.. కాబోయే భర్త మాటలు వినలేక.. చిత్రవధ అనుభవించింది. పదిరోజుల్లో పెళ్లి అనగా.. తన ఫోన్‌ కూడా తీసుకోకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు చేయని ప్రయత్నం లేదు. సిటీని జల్లెడ పడుతున్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల్లో మాత్రం భరత్‌నగర్‌ వరకు వెళ్లినట్టు గుర్తించారు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. ఇదిలాఉంటే.. వాసవిని తాను వేధించానన్న వార్తల్లో నిజం లేదంటున్నాడు సాయి సంచిత్‌. తను నైట్‌ డ్యూటీ చేయడం ఇష్టం లేదని మాత్రమే చెప్పానంటున్నాడు. ఇక పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. 50 రోజులుగా వాసవీ ప్రభ కనిపించకపోవడంతో సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. తొందర్లోనే ఆమె ఆచూకీ కనిపెడ్తామంటున్నారు. మరోవైపు నీకు నచ్చని పెళ్లి చేయం క్షేమంగా తిరిగిరా తల్లి అని వేడుకుంటున్నారు వాసవీ ప్రభ తల్లిదండ్రులు.

No comments:

Post a Comment