త్రిపురలో 48 మందితో బీజేపీ తొలి జాబితా

Telugu Lo Computer
0


త్రిపురలో వచ్చే నెల 16న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి గెలిచిన బీజేపీ ఈసారి కూడా పొత్తులు కుదరకపోవడంతో ఒంటరి పోరుకు సిద్ధమైంది. దీంతో 48 మంది అభ్యర్ధులతో బీజేపీ ఇవాళ తన తొలి జాబితాను విడుదల చేసింది. మరో 12 మంది అభ్యర్ధుల్ని రెండో జాబితాలో ఖరారు చేయబోతోంది. ఇందులో ఇద్దరు ముస్లింలకు బీజేపీ చోటు కల్పించింది. అలాగే మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్ కు ఈ జాబితాలో బీజేపీ చోటు కల్పించలేదు. గతంలో అర్ధాంతరంగా ఆయన్ను సీఎంగా తప్పించిన బీజేపీ, ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోతే భారీ షాక్ కానుంది. మరోవైపు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ కు ఈసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. బీజేపీ తొలి జాబితాలో 21 మంది పాత వారికే టికెట్లు కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ గతసారి మాజీ సీఎం విప్లవ్ దేవ్ గెలిచిన బనమాలిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విప్లవ్ దేవ్ దానిని వదులుకుని ఎంపీ అయినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ప్రతిమా భూమిక్ ధన్‌పూర్ నుండి పోటీ చేయబోతున్నారు. ఆమె గతంలో సిపిఐ(ఎం) కు చెందిన మాజీ సిఎం మాణిక్ సర్కార్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)