23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమారుడి మరణాన్ని చూడలేక తల్లి ముందే చనిపోయింది. అంగవైకల్యంతో ఉన్న కుమారుడిని మెర్సీ కిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకుందామని భర్త ఒత్తిడి తీసుకురావడంతో ఆమె కుమిలిపోయింది. వేధింపులు భరించలేక కొడుకు చావుని చూడలేక ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీలోని మంజీర ట్రినిటీ హోమ్స్ 23 వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అంగవైకల్యం ఉన్న ఎనిమిదేళ్ల కుమారుడి విషయంలో స్వాతిని ఆమె భర్త, అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. కుమారుడిని మెర్సీ కిల్లింగ్ కు దరఖాస్తు చేద్దాం అని స్వాతిని ఒత్తిడి చేశారు. అయితే కుమారుడి మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనకు స్వాతి ఒప్పుకోలేదు. భర్త, అతని కుటుంబసభ్యులు ఎలాగైనా తన కుమారుడిని చంపేస్తారని భావించిన స్వాతి కుమారుడి మరణం చూడలేక ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం తీసుకునేందుకు కూడా భర్త శ్రీధర్, అతని కుటుంబసభ్యులు అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న స్వాతి బంధువులు.. ఆమె చావుకు కారణమైన భర్త శ్రీధర్, అతని కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వాతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)