10 లక్షల టన్నుల కందుల దిగుమతి !

Telugu Lo Computer
0


దేశంలో పప్పు దినుసుల ధరలను నియంత్రించేందుకు దాదాపు 10 లక్షల టన్నుల కందులను దిగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.ఇటీవల కేబినెట్ సెక్రటరీ స్థాయిలో సీనియర్ అధికారుల సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది. గతేడాది డిసెంబర్ 2022లో సుమారు 2 లక్షల టన్నుల కందులను దిగుమతి కేంద్ర ప్రభుత్వం చేసుకుంది. దేశీయంగా లభ్యతను నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం 10 లక్షల టన్నుల వరకు కందులను దిగుమతి చేయబోతుంది. పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడం ద్వారా దేశం పప్పు ధాన్యాల సరఫరాలో ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.మన దేశంలో చాలా వరకు కంది పప్పు తూర్పు ఆఫ్రికా, మయన్మార్ నుండి వస్తుంది.కంది పప్పు దిగుమతి‎కి మార్చి 31, 2024వరకు సాధారణ లైసెన్స్ కూడా వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గతేడాది కందిపప్పు దిగుబడి 43.4లక్షల టన్నులు ఉంది.2022-23 పంట సంవత్సరంలో (జూలై-జూన్) ఉత్పత్తి 38.9 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దిగుబడి తగ్గేందుకు కారణం గుల్బర్గ్ ప్రాంతాల్లోని వాతావరణమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.కరువుతో పాటు పంటకు అనేక రకాల వ్యాధులు సోకడంతో పంట నాశనమైందని, అందుకే ఈసారి పప్పు దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)