భారత్ జోడో యాత్రలో అఖిలేష్, మాయావతి పాల్గొనరు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 27 December 2022

భారత్ జోడో యాత్రలో అఖిలేష్, మాయావతి పాల్గొనరు !


రెండో విడత భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయావతి, అఖిలేష్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఘనశ్యామ్ తివారి కూడా దీనిపై స్పందించారు. తాము 'భారత్ జోడో యాత్ర'కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చకూడదన్న ఉద్దేశంతో తాము ఈ యాత్రలో పాల్గొనబోవడం లేదన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ యాత్రలో చేరడం వల్ల ఇది రాజకీయ కూటమిపై చర్చకు దారి తీసే అవకాశం ఉందని తివారి చెప్పారు. అఖిలేష్ ప్రత్యక్షంగా హాజరు కాకపోయినప్పటికీ, తన పార్టీ తరఫున ప్రతినిధిని ఈ యాత్రకు పంపించే అవకాశాలున్నాయి. మాయావతి కూడా దీనికి హాజరయ్యేందుకు నిరాకరించారు. ఇక రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదురి కూడా తాను యాత్రలో పాల్గొనడం లేదన్నారు. తనకు వేరే కార్యక్రమాలు ఉన్నందున యాత్రలో పాల్గొనడం కుదరడం లేదన్నాడు. తాము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు నడుపుతున్నామని, అందువల్ల తాము ఈ యాత్రకు మద్దతు ఇస్తున్నామని చౌదురి అన్నారు. రెండో విడత భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయావతి, అఖిలేష్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఘనశ్యామ్ తివారి కూడా దీనిపై స్పందించారు. తాము 'భారత్ జోడో యాత్ర'కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చకూడదన్న ఉద్దేశంతో తాము ఈ యాత్రలో పాల్గొనబోవడం లేదన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ యాత్రలో చేరడం వల్ల ఇది రాజకీయ కూటమిపై చర్చకు దారి తీసే అవకాశం ఉందని తివారి చెప్పారు. అఖిలేష్ ప్రత్యక్షంగా హాజరు కాకపోయినప్పటికీ, తన పార్టీ తరఫున ప్రతినిధిని ఈ యాత్రకు పంపించే అవకాశాలున్నాయి. మాయావతి కూడా దీనికి హాజరయ్యేందుకు నిరాకరించారు. ఇక రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదురి కూడా తాను యాత్రలో పాల్గొనడం లేదన్నారు. తనకు వేరే కార్యక్రమాలు ఉన్నందున యాత్రలో పాల్గొనడం కుదరడం లేదన్నాడు. తాము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు నడుపుతున్నామని, అందువల్ల తాము ఈ యాత్రకు మద్దతు ఇస్తున్నామని చౌదురి అన్నారు. 

No comments:

Post a Comment