హైదరాబాద్ లో అమానవీయ ఘటన ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 19 December 2022

హైదరాబాద్ లో అమానవీయ ఘటన !


హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియా కమలానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో నెత్తుటి మరకలతో ఉన్న పురిటిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది. అపార్ట్‌మెంట్‌ వాసులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సాయికుమార్‌ బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూడగా తలకు గాయమై రక్తం కారడం గమనించాడు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బిడ్డను పరీక్షించిన వైద్యులు శిశువు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే మరో ఆసుపత్రికి తీసుకెళ్లవల్సిందిగా సూచించారు. అంబులెన్స్‌లో ఏఎస్‌రావునగర్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు నిలోఫర్‌కు తరలించమని సూచించారు. అక్కడ వెంటిలేటర్‌పై 5 గంటలపాటు చికిత్స అందించినా పసికందు మృతి చెందినట్లు ఎస్సై సాయికుమార్‌ మీడియాకు తెలియజేశారు. సీసీ కెమెరాల ఆధారంతో బిడ్డను ఎవరు వదిలారనే వివరాలను తెలుసుకుంటామని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment