అత్యంత ధనిక సీఎం జగన్ - కేసుల్లో అగ్రస్థానం కేసీఆర్ !

Telugu Lo Computer
0


దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల వ్యక్తిగత వివరాలతో ద ప్రింట్ అనే ఇంగ్లీష్ వెబ్ సైట్ ఓ ప్రత్యే కథనం ప్రచురించింది. దీనికి ఎన్నికల అఫిడవిట్ లో వారిచ్చిన వివరాలను ఆధారంగా తీసుకుంది. దేశంలో అత్యంత ధనిక సీఎంగా వైఎస్ జగన్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 370 కోట్లు. స్థిరాస్తుల్లోనూ ఆయనే టాప్ లో ఉన్నారు. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 132 కోట్లతో నిలిచారు. అతి తక్కువ ఆస్తులున్న సీఎంగా మమతా బెనర్జీ 15 లక్షల, తర్వాత కేరళ సీఎం పినరయి విజయ్ 72 లక్షలు, బీహార్ సీఎం నితీష్ కుమార్ 56 లక్షలతో ఉన్నారు. ఐదుగురు ముఖ్యమంత్రులు అవివాహితులు కాగా, సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్ ముగ్గురు భార్యలను కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. క్రిమినల్ కేసుల విషయానికి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ కేటగిరీలో తమిళనాడు సీఎం స్టాలిన్ రెండో స్థానం (47 కేసులు), మూడో స్థానంలో వైఎస్ జగన్ (38) కేసులతో వరుస క్రమంలో ఉన్నారు. ఎలాంటి నేరారోపణలు లేని ముఖ్యమంత్రులుగా అశోక్ గెహ్లాత్ (రాజస్థాన్, కాంగ్రెస్), మమతా బెనర్జీ (టీఎంసీ), నవీన్ పట్నాయక్ (బీజేడీ), సంగ్మా (మేఘాలయ), రియో (నాగాలాండ్), రంగస్వామి (పుదుచ్చేరి)లు ఉన్నారు. బీజేపీ నుంచి 10 ముఖ్యమంత్రులు ఈ కేటగిరీలో స్థానం దక్కించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)