పెప్సికోలో ఉద్యోగుల తొలగింపు ?

Telugu Lo Computer
0


పెప్సికో కంపెనీ ఉద్యోగులను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నది. వాల్‌ స్ట్రీట్‌ జనర్నల్‌ ప్రకారం.. పెప్సికో ఇంక్‌ న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలోని స్నాక్‌ అండ్‌ బేవరేజెస్‌ యూనిట్ల నుంచి వంద మందికిపైగా ఉద్యోగులను తొలగించే యోచిస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగులకు పంపిన మెమోలో సంస్థను సరళీకృతం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పని చేయవచ్చని కంపెనీ తెలిపినట్లు వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ తెలిపింది. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాలతో పాటు స్నాక్స్ యూనిట్ ఇప్పటికే తొలగింపులు చేపట్టారని, దీంతోపాటు బేవరేజెస్‌ బిజినెస్‌లో భారీగా కోతలుంటాయని పలువురు పేర్కొంటున్నారు. అనిశ్చితి వాతావరణం, ద్రవ్యోల్బణం నిలకడలేమితో పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ ఇంక్‌తో పాటు సీఎన్‌ఎస్‌ తదితర మీడియా దిగ్గజాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌, ఆపిల్‌, మెటా ప్లాట్‌ఫామ్‌ ఇంక్‌ తదితర బడా టెక్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించుకుంటూ వెళ్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)