ప్రియురాలి కోసం తన ఇంటిలోనే చోరీ చేసిన ఘనుడు !

Telugu Lo Computer
0


బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్‌  అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఓ రోజు గోవా ట్రిప్‌ వెళదామని నిశ్చయించుకున్నారు. గోవా ట్రిప్‌ అంటే మాటలు కాదు.. వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్ని ప్రేమల్లోలానే డబ్బు బాధ్యత ఇర్ఫాన్‌పై పడింది. ప్రియురాలితో ఎంజాయ్‌ చేయాలన్న ఉద్ధేశ్యంతో ఓకే అన్నాడు. డబ్బుల కోసం అన్వేషించసాగాడు. ఈ క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు పైసాపైసా కూడబెట్టి కొన్న 103 గ్రాముల బంగారాన్ని దోచేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ప్లాన్‌ చేసుకున్నాడు. తల్లిదండ్రులు నిద్రలో ఉన్నపుడు బంగారం దొంగిలించాడు. తర్వాత ప్రియురాలితో కలిసి గోవా ట్రిప్‌ వెళ్లాడు. ఇక్కడ ఇంట్లో బంగారం కనిపించకపోయే సరికి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇర్ఫాన్‌ బంగారాన్ని దొంగతనం చేసి, ప్రియురాలితో గోవా ట్రిప్‌ వెళ్లినట్లు తేలింది. పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)