బ్రిటీషర్లకు పూర్వమే శ్రీరాముడు, హనుమంతుడు ఉన్నారు !

Telugu Lo Computer
0

 

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి తన సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. శ్రీరాముడు, హనుమంతుడు బీజేపీ కార్యకర్తలు కాదని, ఇతరులెవరూ వారి భక్తులు కాకూడదనే తప్పుడు భావాన్ని సృష్టించవద్దని హితవు పలికారు. దేవుళ్లు, దేవతలు కుల, మతాలకు కట్టుబడేవారు కాదన్నారు. జనసంఘ్‌కు పూర్వం, మొఖలులు, బ్రిటిషర్లకు పూర్వం కూడా శ్రీరాముడు, హనుమంతుడు ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహస్తున్న భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ, తాను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడుగుతున్నానన్నారు. భారత దేశం ముక్కలైనట్లు ఆయన ఎక్కడ చూశారో చెప్పాలన్నారు. నిజానికి అధికరణ 370ని రద్దు చేయడం వల్ల భారత దేశం బలోపేతమైందని చెప్పారు. భారత దేశం ఒకసారి మాత్రమే ముక్కలైందన్నారు. కాంగ్రెస్  దేశాన్ని విభజించినపుడు అది జరిగిందన్నారు. భారత దేశాన్ని ఏకం చేయాలని కాంగ్రెస్ కోరుకుంటే, దేశ విభజనకు పూర్వం భారత దేశంలో ఉన్న ప్రాంతాలను కలపడం గురించి మాట్లాడాలని చెప్పారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇటీవల కర్ణాటకలో మాట్లాడుతూ హిందువులు తమ ఇళ్లలో కత్తులను ఉంచుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను ఉమా భారతి సమర్థించారు. ఆయుధాన్ని ఉంచుకోవడం తప్పు కాదని, దాడి చేసే మనస్తత్వం ఉండటమే తప్పు అని చెప్పారు. 'పఠాన్' సినిమా గురించి మాట్లాడుతూ, కాషాయాన్ని అవమానిస్తే సహించేది లేదన్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్ని వేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)