డాక్‌-1 మాక్స్‌ దగ్గు మందు ఘటనపై దర్యాప్తునకు ఆదేశం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన మరియన్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన డాక్‌-1 మాక్స్‌ దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్​లో 18 మంది పిల్లలు చనిపోయిన ఘటనపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణల క్రమంలో డాక్‌-1 మాక్స్ తయారీని ఆపేయాలని కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ (సీడీఎస్​సీఓ), ఉత్తరప్రదేశ్‌ డ్రగ్స్‌ కంట్రోలింగ్ అండ్‌ లైసెన్సింగ్ అథారిటీ కలిసి దర్యాప్తు చేపడుతాయన్నారు. ఫార్మా కంపెనీని తనిఖీ చేశాక.. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు కంపెనీకి వెళ్లి శాంపిల్స్​ సేకరించి చండీగఢ్​​లోని రీజినల్​ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి పంపించారన్నారు. డాక్‌-1 మ్యాక్స్​ సిరప్ యూపీ నుంచి కేవలం ఉజ్బెకిస్తాన్​కే ఎగుమతి అయినట్టు గుర్తించామన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, 10 ఏండ్లుగా సేవలు అందిస్తున్నామని మరియన్​ బయోటెక్​ లీగల్​ ప్రతినిధి హసన్​ హార్రీస్​ తెలిపారు. గవర్నమెంట్​ రిపోర్టు వచ్చే దాకా తయారీని నిలిపేసినట్టు వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)