మేఘాలయ సీఎం నివాసం వద్ద నిరసనలు

Telugu Lo Computer
0


ముక్రోహ్ కాల్పుల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఐదు స్వచ్ఛంద సంస్థలు ఓ కూటమిగా ఏర్పడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నవంబరు 22న అస్సాం అటవీ శాఖ సిబ్బంది ఓ లారీని ఆపారు. అక్రమంగా నరికిన చెట్లను ఈ లారీలో తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అస్సాం ఫారెస్ట్ గార్డ్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, మేఘాలయ మధ్య సుదీర్ఘ కాలం నుంచి ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని స్వచ్ఛంద సంస్థల కూటమి ఆరోపిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)