ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వానలు

Telugu Lo Computer
0


ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని కావలి, గూడూరు, సూళ్లూరుపేటలో కుండపోత వర్షం పండుతున్నాయి. ఒంగోలులో భారీ వర్షం, అద్దంకిలో ఓమోస్తరు వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. కావలి, వెంకటాపురం, కోవూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. తుఫాన్ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు హడలెత్తిస్తున్నాయి. ఒంగోలులో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒంగోలులో భారీ వర్షానికి నాళాలు పొంగిపొర్లుతున్నాయి. రేపల్లె, నిజాంపట్నం మండలాలు కుండపోత వర్షాలకు తడచిముద్దయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు, చిన్నగంజాం, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అద్దంకిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అద్దంకిలో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు గుంటూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులోని పలు ప్రాంతాలు వరుస వర్షాలకు వణికిపోతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)