ఇండియన్ కోస్ట్‌గార్డ్ లో అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ చేరిక !

Telugu Lo Computer
0


ఇండియన్ కోస్ట్ గార్డ్ అమ్ములపొదిలోకి అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ చేరింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ను నేవీ డీజీ పఠానియా చెన్నైలోని ఎయిర్ స్టేషనులో ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్ కు అనుగుణంగా హెలికాప్టర్ తయారీ రంగంలో స్వావలంబన దిశగా దూసుకుపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఈ హెలికాప్టర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని సున్నితమైన జలాల్లో భారత తీర రక్షక దళం సామర్థ్యాన్ని పెంచుతోందని నేవీ అధికారులు చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో  తయారు చేసిన ఈ హెలికాప్టర్లు అధునాతన రాడార్‌తో పాటు ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్‌లు, శక్తి ఇంజిన్‌లు, ఫుల్ గ్లాస్ కాక్‌పిట్, హై-ఇంటెన్సిటీ సెర్చ్ లైట్, అడ్వాన్స్‌డ్ వంటి అత్యాధునిక పరికరాలున్నాయి. నౌకల నుంచి ఈ హెలికాప్టర్‌ ద్వారా సముద్ర నిఘాను పగలూ రాత్రీ చేపట్టడానికి వీలవుతోంది.చెన్నైలోని కేంద్రంలో నాలుగు అధునాతన హెలికాప్టర్లను మోహరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)