బొప్పాయి - ఉపయోగాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 November 2022

బొప్పాయి - ఉపయోగాలు !


బొప్పాయి పండును తరచూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి మన శరీర జీవక్రియలను పెంచి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బొప్పాయి పండ్ల రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే జీర్ణ క్రియ రేటు పెరిగి మనం తీసుకునే ఆహారం నుంచి సంపూర్ణ పోషకాలను మన శరీరం గ్రహించే శక్తిని ఇస్తుంది. దీనిలో విటమిన్స్, మినరల్స్ ,కార్బోహైడ్రేట్స్ , ఫైబర్, క్యాల్షియం ,మెగ్నీషియం ,ఐరన్ , పోలేట్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బొప్పాయి పండును లేదా బొప్పాయి జ్యూస్ ను జ్వరం వచ్చినప్పుడు అధికంగా తినకూడదని చెబుతుంటారు. ఇది కొంతవరకు వాస్తవమే బొప్పాయి పండులో వేడిని కలిగించే గుణం ఉంటుంది కావున అధిక జ్వరంతో బాధపడేవారు ఈ పండును తక్కువ పరిమాణంలో తీసుకోవడమే మంచిది. ఎక్కువగా తిన్నట్లయితే శరీరంలో వేడి అధికమై జ్వరం తీవ్రత మరింత పెరుగుతుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడు బాధపడేవారు తక్కువ పరిమాణంలో బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరిగి త్వరగా కోలుకుంటారు. బొప్పాయి పండ్లను ప్రతిరోజు తక్కువ పరిమాణంలో నిక్షేపంగా తినవచ్చు. వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాలు సీజనల్గా వచ్చే అలర్జీ సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయి పండు రసాన్ని ప్రతిరోజు సేవిస్తే వీటిలో పుష్కలంగా విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే చర్మంపై ముడతలు తగ్గించి చర్మ కాంతిని పెంచుతుంది. బొప్పాయి పండు లో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారక కణాలతో సమృద్ధిగా పోరాడి లివర్ క్యాన్సర్, పొట్ట, పెద్ద పేగు క్యాన్సర్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని అతి బరువు సమస్యను దూరం చేస్తుంది.

No comments:

Post a Comment