నమ్మి వచ్చినందుకు ముక్కలు ముక్కలు చేశాడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 November 2022

నమ్మి వచ్చినందుకు ముక్కలు ముక్కలు చేశాడు !


ముంబైలోని ఓ కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్న శ్రద్ధ కు  కొన్నాళ్ల క్రితం అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి బంధాన్ని పెద్దలు ఆమోదించలేదు. దాంతో ఇద్దరు ఢిల్లీ చేరుకుని ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత నుంచి శ్రద్ధ తన కుటుంబ సభ్యులు కాల్‌ చేస్తే స్పందించడం మానేసింది. ఈ క్రమంలో ఓ రోజు శ్రద్ధ తండ్రి ఢిల్లీలో వీరు నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి చూడగా లాక్‌ వేసి ఉంది. దాంతో అనుమానం వచ్చి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శ్రద్ధ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూనావాలను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత శ్రద్ధ తరచుగా వివాహ ప్రస్తావన తెచ్చి తనతో గొడవడేదని తెలిపాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మే 18న మరోసారి శ్రద్ధ వివాహ ప్రస్తావన తెచ్చిందని, దాంతో తనకు కోపం వచ్చి ఆమె గొంతు కోసి హత్య చేశానని వెల్లడించాడు. ఆ తర్వాత శ్రద్ధ మృతదేహాన్ని 35 భాగాలుగా కట్‌ చేసి, వాటిని భద్రపర్చడం కోసం ఓ ఫ్రిడ్జ్‌ కొని అందులో నిల్వ చేశానని వెల్లడించాడు. ఆ తర్వాత ప్రతి రోజు తెల్లవారుజాము ప్రాంతంలో బయటకు వెళ్లి, శ్రద్ధ శరీర భాగాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేసి, ఉదయం ఇంటికి వచ్చేవాడనని వివరించాడు. అలా 18 రోజుల పాటు శ్రద్ధ శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేశానని వెల్లడించాడు. పూనావాలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

No comments:

Post a Comment