వాట్సాప్ నుంచి వైదొలిగిన అభిజిత్ బోస్

Telugu Lo Computer
0


వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ ఈరోజు రాజీనామా చేశాడు. వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా 2018లో అభిజిత్ బాధ్యతలు చేపట్టాడు. వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్ ఫీచర్ తీసుకురావడంలో అతని కృషి ఎంతో ఉంది. వాట్సాప్‌ని దేశంలోని ప్రజలందరికీ చేరువ చేయడంలో అభినవ్ విజయం సాధించాడు. అతను పదవి నుంచి తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అభిజిత్ వాట్సాప్ ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఎజెటాప్ అనే పేమెంట్ కంపెనీలో పనిచేశాడు. మెటా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న వారంలోనే అభిజిత్ రాజీనామా చేశాడు. ‘వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా ఎనలేని సేవలు అందించిన అభిజిత్‌కు ధన్యవాదాలు. వాట్సాప్‌లో కొత్త సేవలు ప్రారంభించడానికి, వాట్సాప్ వ్యాపారం పెరగడానికి అతని ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అని వాట్సాప్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)