ఆడపిల్లలను పెంచే సామాజిక బాధ్యత కుటుంబానిదే !

Telugu Lo Computer
0


శ్రద్ధావాకర్ ను ప్రియుడే దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆడపిల్లల తల్లిదండ్రులకు తాజాగా సలహా ఇచ్చారు. శ్రద్ధా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా ఆమె తల్లిదండ్రులు కుమార్తెను ట్రాక్ చేయాల్సి ఉండేదని కిరణ్ బేడీ చెప్పారు. శ్రద్ధా తల్లిదండ్రులు కుమార్తె పట్ల మరింత శ్రద్ద చూపించాల్సిన అవసరం ఉందని, ఇరుగుపొరుగు వారు, ఆమె నివసించిన ఫ్లాట్ యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందని కిరణ్ బేడీ అన్నారు. శ్రద్ధా వాకర్ విషయంలో ఆమె తల్లిదండ్రులు ఆలస్యంగా ఆరా తీశారని బేడీ చెప్పారు. శ్రద్ధావాకర్ హత్యోదంతం సమాజం, స్నేహితుల వైఫల్యం వల్ల జరిగిందన్నారు. ఆడపిల్లలను పెంచే సామాజిక బాధ్యత కుటుంబానిదేనని, వారికి భరోసా ఇవ్వాలని కిరణ్ బేడీ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)