శాకాహారులు తగ్గుతున్నారు !

Telugu Lo Computer
0


ప్రపంచంలోని చాలా దేశాల్లో వెగాన్‌ డైట్‌ ట్రెండ్‌ నెమ్మదిగా విస్తరిస్తోందని స్టాటిస్టా గ్లోబల్‌ కన్జూమర్‌ సర్వే ప్రకారం తెలుస్తోంది. ముఖ్యంగా యూరప్‌లోని కొన్ని దేశాలతోపాటు అమెరికాలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. కానీ భారత్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్న  పరిస్థితి నెలకొంది. దేశంలో సంప్రదాయక శాకాహారులు సర్వభక్షకులుగా మారుతుండటం అంతకంతకూ పెరుగుతోంది. 2018-19లో పట్టణ ప్రాంత భారతీయుల్లో మూడో వంతు మంది తాము శాకాహారులమని పేర్కొనగా 2021-22 నాటికి వారి శాతం ఒక వంతుకు పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే గత మూడేళ్లలో వెజిటేరియన్‌ డైట్‌ ప్రజాదరణ పొందినప్పటికీ కొన్ని దేశాలు మాత్రం నేటికీ మాంసాహారం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. మెక్సికో, స్పెయిన్‌ వంటి దేశాల్లో నేటికీ శాకాహారం భుజించే వారి శాతం అటుఇటుగా 3 శాతంగా ఉంటోందని అధ్యయనం తెలిపింది. దక్షిణకొరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ 2018-19లో 0.9 శాతంగా ఉన్న శాకాహారులు 2021-22 నాటికి 2.5 శాతానికి పెరగడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)