అధికారంలోకి వస్తే దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి !

Telugu Lo Computer
1


కర్ణాటకలోని కోలారులో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ అధికారంలోకి వస్తే దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని, అలాగే మైనార్టీ నేతలకు కీలక శాఖతో కేబినెట్‌ పదవి కట్టబెడతామన్నారు.  బీజేపీ, కాంగ్రెస్‌ దళితులు, మైనార్టీలను ఇంతకాలం ఓటు బ్యాంకులుగా వాడుకున్నాయని, వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలు దళితులకు పూర్తిగా దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. 2023 శాసనసభ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నియోజక వర్గాల్లో దళితులు, మైనార్టీలు, ఇతర బలహీన వర్గాలకు అత్యధికంగా టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. కోలారులో తమ పార్టీ తలపెట్టిన పంచరత్న రఽథయాత్రలకు అనూహ్య స్పందన లభిస్తోందని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే తమ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోందన్నారు.

Post a Comment

1Comments

  1. ఒకరాష్ట్రంలో ఒకాయన దళితులకు ముఖ్యమంత్రి ఫదవినే ఇస్తాననన్నారు. ఏరుదాటి తెప్పను తగలేసారు. తానే ఆపదవిలో పాతుకుపోయారు. రాష్ట్రానికి అదే అవసరం..ట.

    ReplyDelete
Post a Comment