ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేసిన స్టార్ బక్స్ కౌ ఫౌండర్

Telugu Lo Computer
0


హైఎండ్ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ కో-ఫౌండర్ జెవ్ సీగల్ బెంగళూర్‌లోని విద్యార్ధి భవన్‌లో మసాలా దోసెను టేస్ట్ చేసి ఆపై దేశీ ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేశారు. 1943లో ఏర్పాటై విశేష ప్రాచుర్యం పొందిన విద్యార్ధి భవన్‌లో జెవ్ సీగల్ కొద్దిసేపు గడిపి అక్కడి రుచులను ఆస్వాదించారు. స్ధానిక వంటకాలను రుచి చూసేందుకు బెంగళూర్‌లో విద్యార్ధి భవన్ బెస్ట్ ప్లేస్‌గా చెబుతుంటారు. స్టార్ బక్స్ కౌ ఫౌండర్ జెవ్ సీగల్ తమ రెస్టారెంట్‌లో మసాలా దోసెను రుచి చూసి ఘుమఘుమలాడే కాఫీని ఆస్వాదించారని, ఆయన తన అనుభవాన్ని తమ గెస్ట్‌బుక్‌లోనూ రాసుకొచ్చారని విద్యార్ధి భవన్ తమ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అమెరికన్ వ్యాపారవేత్త జెవ్ సీగల్ 1971లో స్టార్‌బక్స్‌ను మరో భాగస్వామితో కలిసి ప్రారంభించారు. ఆపై ఆయన స్టార్‌బక్స్ వైస్ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌గా వ్యవహరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు సీగల్ బెంగళూర్ వచ్చారు. జెవ్ సీగల్ విద్యార్ధి భవన్‌లో గడిపిన క్షణాలపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)